IPL 2023: రేపు రాత్రే.. ఐపీఎల్ కొత్త, పాత చాంపియన్ల తొలి సమరం..

by Mahesh |   ( Updated:2023-03-30 09:32:54.0  )
IPL 2023: రేపు రాత్రే.. ఐపీఎల్ కొత్త, పాత చాంపియన్ల తొలి సమరం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఐపీఎల్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత భారత్‌లో ప్రేక్షకులకు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో రేపు రాత్రి 7.30 గంటలకు 2022 చాంపియన్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్లు గుజరాత్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్ అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనున్నాయి. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ప్రారంభ సెర్మనీ అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీని అనంతరం రాత్రి 7 గంటలకు టాస్.. 7.30 మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫుల్‌ఫామ్‌తో ఆడునున్నట్లు క్రికెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు. అలాగే గుజరాత్ జట్టు కూడా యువ ప్లేయర్లతో చెన్నై జట్టును ఢీకొట్టేందుకు సిద్ధం అయింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు పూర్తిగా హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిష్టాత్మక మొదటి మ్యాచ్‌లో ఎవరు విజయం సాదిస్తారో తెలియాలి అంటే రేపు రాత్రి 7.30 వరకు వేచి చూడాలి. కాగా ఈ మ్యాచ్‌లను జీయో నెటవర్క్ యూజర్లు జీయో సినిమాలో ఫ్రీగా చూడోచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్‌లో కూడా చూడవచ్చు.

Advertisement

Next Story