RCB ఫ్యాన్స్‌ను 'నోరు మూయమంటూ' గౌతమ్ గంభీర్ వార్నింగ్.. (వీడియో)

by Mahesh |   ( Updated:2023-04-11 12:11:13.0  )
RCB ఫ్యాన్స్‌ను నోరు మూయమంటూ గౌతమ్ గంభీర్ వార్నింగ్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సోమవారం RCB vs LSG మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. చివరి బంతివరకు తీవ్ర ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు చివరి బంతి విజయం సాధించింది. ఈ క్రమంలో గ్రౌండ్‌లోకి ఎల్‌ఎస్‌జి మెంటర్ గౌతమ్ గంభీర్ వచ్చాడు. ఆ సమయంలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ బిగ్గరా RCB.. RCB.. RCB అంటూ అరిచారు. దీంతో గౌతమ్ గంభీర్ పెదవులపై వేలు పెట్టి, ఆర్‌సిబి అభిమానులను 'నోరు మూసుకోమని' సూచించాడు. దీంతో దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గంభీర్ ను సోషల్ మీడియాలో మిస్టర్ అగ్రెస్సీవ్ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story