ఐపీఎల్ 2023 ఫైనల్.. ధోని కెరీర్‌లో చారిత్రాత్మక మ్యాచ్

by Mahesh |   ( Updated:2023-05-28 07:48:34.0  )
ఐపీఎల్ 2023 ఫైనల్.. ధోని కెరీర్‌లో చారిత్రాత్మక మ్యాచ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ధోని రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలకు ఈ రోజు మ్యాచ్ అనంతరం క్లారిటీ రానుంది. దీంతో ధోని లైఫ్ లో అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ కు మరో చరిత్ర కూడా ఉంది. ఈ రోజు ధోని ఆడబోయేది.. తన ఐపీఎల్ కెరియర్‌లో 250వ మ్యాచ్.. దీంతో ఈ ప్రతిష్టాత్మక మైల్‌స్టోన్ మ్యాచ్ చూసెందుకు ఎంతో ఆత్రుతతో వేచి ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ధోని కప్ గెలిచి.. రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే సాయంత్రం వర్షం పడే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ కొనసాగుతుందో లేదో తెలియాలి అంటే ఆ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story