- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో నిద్రపోయిన చెన్నై అభిమానులు
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుండగా భారీ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది. దీంతో భారీ సంఖ్యలో ఆహ్మదాబాద్ వచ్చిన ధోని, చెన్నై అభిమానులు ఎటు వెళ్లాలో తెలియక.. లాడ్జులు అన్ని ఫుల్ అవ్వడంతో ఆహ్మదాబాద్ రైల్వే స్టేషన్ లోనే నిద్రపోయారు. ధోని ఆడబోయే చివరి మ్యాచ్ అని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కచ్చితంగా చూడాలని అతని అభిమానులు.. భీష్మించుకు కూర్చున్నారు. కానీ భారీ వర్షం వారిని అతలాకుతలం చేసింది.
దీంతో ఎమ్ చేయాలో తెలియక ఎలాగైన మ్యాచ్ ను చూసాకే తిరిగి వెళ్లేది అని.. ఆహ్మదాబాద్ స్టేడియంలో సమీపంలో ఉన్న అన్ని బస్ షేల్టర్లు, రైల్వే స్టేషన్‌లో రాత్రి నిద్రించారు. వాటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రోజు రాత్రి 7.30కి ఎటువంటి వర్షం రాకపోతే.. ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దాదాపు లక్ష టికెట్ల వరకు అమ్మడు పోగా.. వర్షం వారందరికీ నిరుత్సాహాన్ని మిగిల్చింది. మరి ఈ రోజైన వరుణుడు కరుణించి మ్యాచ్ నడుస్తుందో లేదో తెలియాలి అంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.