ఆడిన 14 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్ కు పోయిన జట్టు ఏదో తెలుసా?

by Javid Pasha |   ( Updated:2023-05-21 13:34:28.0  )
ఆడిన 14 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్ కు పోయిన జట్టు ఏదో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ కు ఎంతో క్రేజ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఐపీఎల్ లో బాగా ఆడితే చాలు తమ దేశాల జట్లకు ఈజీగా సెలెక్ట్ కావొచ్చని ప్లేయర్లు నమ్ముతుంటారు. మరి అలాంటి ఈ టోర్నీలో ఒక్కో దశ దాటుకుంటూ ప్లే ఆఫ్ కు పోవడం అంత ఈజీ కాదు. కానీ ఆడిన 14 ఐపీఎల్ టోర్నీల్లో 12 సార్లు ప్లే ఆఫ్ కు చేరుకుని ఐపీఎల్ ‘కింగ్’ అనిపించుకుంది చెన్నయ్ జట్టు. మిస్టర్ కూల్ ధోనీ సారథ్యంలోని చెన్నయ్ సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంది.

నాలుగు సార్లు చాంపియన్ గా, ఐదు సార్లు రన్నరప్ గా నిలిచింది. ఇక అత్యధిక సార్లు ప్లే ఆఫ్ కు చేరుకున్న జట్లలో 12 సార్లు ప్లే ఆఫ్ చేరి ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ఇక ఈ విభాగంతో ఒక్క ముంబై ఇండియన్స్ మాత్రమే 9 సార్లు ప్లే ఆఫ్ కు చేరుకొని సీఎస్కే దరిదాపులో ఉంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ లో 2020, 2021లో మాత్రమే సీఎస్కే ప్లే ఆఫ్ దశకు చేరుకోలేదు. ఇక 2015, 2016లో సీఎస్కే జట్టు నిషేధానికి గురైంది. ఈ సీజన్ లో ఈ నెల 20న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 77 పరుగుల తేడాతో గెలిచి సీఎస్కే 12వ సారి ప్లే ఆఫ్ కు చేరుకుంది.

Advertisement

Next Story