రాజస్థాన్ భారీ విజయం..

by Mahesh |   ( Updated:2023-04-08 13:54:49.0  )
రాజస్థాన్ భారీ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 11వ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి మొదటి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది.దీంతో ఢిల్లీ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ జట్టు 57 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ నాలుగు ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. అలాగే అశ్విన్ 2, చహల్ 3, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.

Advertisement

Next Story