నాడు కోహ్లీని రోహిత్.. నేడు జడేజాను ధోనీ

by Mahesh |   ( Updated:2023-05-30 05:04:19.0  )
నాడు కోహ్లీని రోహిత్.. నేడు జడేజాను ధోనీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో జడేజా చివరి రెండు బంతులకు పది పరుగులు చేసి చెన్నై జట్టుకు, ధోనికి ఐపీఎల్ కప్‌ను సాధించాడు. అయితే ఈ మ్యాచ్ చివర్లో అందరూ ఆనందంగా ఉన్నప్పటికి ధోని డక్‌అవుట్ కావడంతో.. చాలా సేపు సైలెంట్‌గా ఉండిపోయాడు. మ్యాచ్ గెలిచినా కూడా అంతగా అనంధించలేదు.. కానీ జడేజా మాత్రం చివరి బంతికి ఫోర్ కోట్టి డైరెక్టుగా ధోని వద్దకే పరుగెత్తాడు. దీంతో ధోని ఆనందంతో జడేజాను ఒక్కసారిగా కౌగిలించుకొని పైకి ఎత్తుకున్నాడు. దీంతో చెన్నై ప్లేయర్లు, అభిమానులు చాలా ఆనందించారు. అయితే ఈ చిత్రం పాకిస్తాన్ మ్యాచ్‌లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ కూడా ఇలానే కోహ్లీని ఆకాశానికి ఎత్తేశాడు. నాడు రోహిత్ కోహ్లీని.. నేడు జడేజాను ధోని ఎత్తిన ఫొటోలను పక్కపక్కనే పెట్టి ఈ సంవత్సరంలో జరిగిన విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Also Read: రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం.. MS ధోనీ కీలక వ్యాఖ్యలు..

Advertisement

Next Story