- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్.. నేడు బెంగళూరు Vs ముంబయి
దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఊహించని పరిణామాలతో ప్రతి మ్యాచ్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 224 భారీ లక్ష్యాన్ని ఛేధించి ఐపీఎల్‌పై అంచనాలను పెంచింది. కాగా సోమవారం మ్యాచ్ నెంబర్ 10లో రాయల్ చాలెంజర్స్ జట్టు డిపెండింగ్ చాంపియన్ ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు జరుగనుంది. సన్‌రైజర్స్‌పై అద్భుత విజయం సాధించిన బెంగళూరు, ఆ తర్వాత పంజాబ్ జట్టుపై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలనే ఆలోచనతో బరిలోకి దిగనున్నారు. అటు ముంబయి జట్టు తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో మ్యాచ్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో రోహిత్, బౌలింగ్‌లో బుమ్రా ఫామ్‌లో ఉన్నారు. పొలార్డ్ వంటి ఆల్‌రౌండర్లు రాణిస్తే జట్టుకు తిరుగుండదు.