- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు 20లోగా యూఏఈకి ఐపీఎల్ జట్లు
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా మార్చి నుంచి సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను యూఏఈ వేదికగా నిర్వహించుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అనుమతులు వచ్చిన వెంటనే అన్ని జట్లకు బీసీసీఐ సమాచారం పంపింది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడానికి కొన్ని జట్లు ఈ నెల 10లోగా యూఏఈ చేరుకొని శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే, ఇండియాలోనే ఆటగాళ్లందరికీ కరోనా టెస్టులు నిర్వహించి, ఆ తర్వాత ఐపీఎల్ జీసీ కౌన్సిల్ ఆమోదించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అనుసరిస్తూ ఆటగాళ్లు, సిబ్బందిని 20లోగా తీసుకెళ్లాలని పాలక మండలి సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రొటోకాల్స్ పాటించి, పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు సమయం పడుతుందని భావించిన సీజీ, ఫ్రాంచైజీలకు సూచనలు చేసింది. ముఖ్యంగా యూఏఈకి వెళ్లే ముందు ఆటగాళ్లకు వైరస్ పరీక్షలు చేసేందుకు సమయం పట్టనుందని సమాచారం. యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో ఐపీఎల్ నిర్వహించనున్నారు.