- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈసారి ఐపీఎల్ నిర్వహించేది అక్కడే.. ఏర్పాట్లు షురూ
దిశ, స్పోర్ట్స్: ఊగిసలాటల నడుమ ఐపీఎల్ 2020ని ఈసారి దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. సెప్టెంబర్ చివరివారం నుంచి నవంబర్ మొదటి వారం మధ్య కుదించిన ఫార్మాట్‌లో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలోని అంతర్జాతీయ స్టేడియంతో పాటు ఐసీసీ అకాడమీ స్టేడియాన్నీ ఈ మెగా లీగ్ కోసం ఉపయోగించుకోనున్నారు. టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ తమ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మరోవైపు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కోసం కూడా బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది.
ఏర్పాట్లు షురూ..
యూఏఈలో ఐపీఎల్ కోసం ఆటగాళ్లను, సిబ్బందిని ఇండియా నుంచి తరలించాల్సి ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలు ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ కల్లా ప్రారంభం అవుతాయి. కానీ ఆటగాళ్ల ఆరోగ్య భద్రత, సమయానికి టికెట్ల అందుబాటు వంటి కారణాలతో కొన్ని ఫ్రాంచైజీలు చార్టెడ్ ఫ్లయిట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆటగాళ్లందరినీ ఒకేసారి ఇండియా నుంచి యూఏఈకి ప్రత్యేక విమానాల్లో పంపించడం ద్వారా అన్ని రకాలుగా కలిసి వస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు అబుధాబి, దుబాయ్ తదితర ప్రాంతాల్లో ఉన్న స్టార్ హోటల్స్ బుకింగ్ కూడా వేగంగా జరుగుతున్నది. సాధారణ రోజుల్లో అయితే ఇక్కడి స్టార్ హోటల్స్‌లో బస దొరకడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంతో అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోవడం, టూరిజం కూడా నిలిచిపోవడంతో కాస్త సులభంగానే రూమ్స్ అద్దెకు దొరుకుతాయి. అయినా సరే సెప్టెంబర్ నాటికి ఇప్పటి నుంచే గదులను రిజర్వ్ చేస్తున్నట్లు ఒక ఫ్రాంచైజీ అధికారి చెప్పారు.
క్వారంటైన్ ఎక్కడ..?
ఐపీఎల్‌కు ముందు ఆయా ఫ్రాంచైజీల్లోని ఆటగాళ్లందరినీ 14రోజుల పాటు క్వారంటైన్ చేయడం తప్పనిసరి. అయితే, ఆటగాళ్లు, సిబ్బందిని 14రోజుల ముందే యూఏఈ తరలించి అక్కడ క్వారంటైన్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అందుకు ముందుగా ఇండియాలోనే భద్రత కలిగిన ప్రదేశంలో క్వారంటైన్ చేసి, లీగ్ ప్రారంభానికి ముందు యూఏఈ తరలిస్తామని ఒక ఫ్రాంచైజ్ అధికారి చెప్పారు. ఆటగాళ్ల శిక్షణ కార్యక్రమాలు కూడా ఇక్కడే నిర్వహిస్తామని, స్థానికంగా బయోబబుల్ సృష్టించి ఆటగాళ్ల ఆరోగ్యాలు కాపాడతామని అంటున్నారు. అలాగే, కొవిట్ టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే యూఏఈకి పంపుతామన్నారు. విదేశీ ఆటగాళ్లను కూడా ముందుగా ఇండియాకు రప్పించి అందరు ఆటగాళ్లను ఒక చోట చేర్చి శిక్షణ, ఇతర కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఐపీఎల్ ఆడటానికి దుబాయ్ తీసుకెళ్తారు. ఏదేమైనా జరగదనుకున్న ఐపీఎల్ జరగబోతున్నది. దీంతో ఫ్రాంచైజీలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే తదుపరి ఏర్పాట్లన్నీ బీసీసీఐ చేయనున్నది.