- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘క్రికెట్ సీజన్ ఆరంభమైతే.. ఐపీఎల్ మా తొలి ప్రాధాన్యం’
దిశ, స్పోర్ట్స్ :
కరోనా వైరస్ నేపథ్యంలో స్తంభించిపోయిన క్రికెట్‌ను ఒకటి రెండు నెలల్లో తిరిగి ప్రారంభించాలని పలు క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. ఇప్పట్లో ఐసీసీ టోర్నీలు నిర్వహించకపోవడమే మంచిదని భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి అంటున్నారు. క్రికెట్ కనుక ప్రారంభమైతే ఐపీఎల్ ఆడటానికే తాము ప్రాధాన్యత ఇస్తామని అన్నాడు. టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నీలు నిర్వహించినా ప్రేక్షకులు ఇల్లు దాటి బయటకు వస్తారని తాను భావించడం లేదని.. అందరూ ఇంటికే పరిమితమైన సమయంలో ముందుగా దేశవాళీ క్రికెట్ ప్రారంభించడం మంచిదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం వల్ల ప్రేక్షకుల్లో కొంచెం ధైర్యాన్ని నింపవచ్చు.. ఆ తర్వాత నెమ్మదిగా ఐసీసీ టోర్నీలను పునఃప్రారంభించవచ్చని ఆయన అన్నారు. పది, పదిహేను జట్లను ఒక చోట చేర్చి ఆడటం కంటే.. ఒకే జట్టుతో ఒకే వేదికలో సిరీస్ ముగించేయడం చాలా సులభంగా ఉంటుందన్నారు. నేనైతే ఐసీసీ టోర్నీల కంటే ద్వైపాక్షిక సిరీస్‌లనే ఎంచుకుంటామని.. ఆటగాళ్లు కూడా ప్రస్తుతం తక్కువ నిడివి గల సిరీస్‌లను ఆడటానికే మొగ్గుచూపతారని భావిస్తున్నట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు.