- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయోబబుల్ నియమాలను కఠినతరం చేసిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో కోవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ తీవ్రంగా మారడంతో చాలా మంది విదేశీ క్రికెట్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. మరి కొంత మంది వెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బయోబబుల్‌కు సంబంధించిన నియమాలను మరింత కఠినతరం చేసినట్లు బీసీసీఐ చెప్పింది. ఇకపై బయోబబుల్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికి 2 రోజులకు ఒకసారి ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించనున్నారు. గతంలో 5 రోజులకు ఒకసారి మాత్రమే ఈ టెస్టు చేసేవాళ్లు. అంతే కాకుండా ఇకపై బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచేసుకోవాలని బీసీసీఐ ఆదేశించింది.
గతంలో టీమ్స్ బస చేసిన హోటల్స్ నుంచే కాకుండా బయటి నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వాళ్లు. ఇకపై బయోబబుల్‌లో ఉన్న కిచెన్ వంటకాలు మాత్రమే క్రికెటర్లు, ఇతరులకు అందిస్తారు. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడంపై బీసీసీఐ నిషేధం విధించింది. బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినా.. ప్రతీ ఖాళీ ప్లేటుకు ఫైవ్ స్టార్ హోటల్స్ రూ. 500 చార్జ్ చేస్తున్నాయి. ఈ దుబారా ఖర్చుకు కూడా బ్రేక్ వేసినట్లు అవుతున్నది.