- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
120 దేశాల్లో ఐపీఎల్ ప్రసారాలు
దిశ, స్పోర్ట్స్: మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఈ క్రికెట్ లీగ్‌ను ప్రేక్షకులకు చేరవేసేందుకు బీసీసీఐ ఇప్పటికే పలు ప్రసారకర్తలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత ఉపఖండంలో ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో క్రికెట్ ప్రసారాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐసీసీ అనుబంధ సభ్యులుగా ఉన్న ప్రతీ దేశంలో ఐపీఎల్ ప్రసారం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి తగినట్లుగా ప్రొడక్షన్ టీం సన్నాహాలు చేస్తున్నది. కేవలం టీవీల్లోనే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్స్, వెబ్ స్ట్రీమింగ్ కూడా చేయబోతున్నట్లు స్టార్ గ్రూప్ ప్రతినిధి తెలిపాడు.
ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఐపీఎల్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు భారత ప్రాంతీయ భాషల్లో వేర్వేరుగా ప్రసారం చేయనున్నారు. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన ప్రాంతీయ భాషా ఛానెల్స్‌లో ప్రతీ రోజు ప్రసారాలు ఉంటాయి. అయితే ఆయా భాషల్లోని అనుబంధ హెచ్‌డీ చానల్స్‌లో ప్రతీ ఆదివారం ప్రసారం ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ప్రతీ రోజు మ్యాచ్ ప్రసారం చేస్తారు. అలాగే ప్రతీ ఆదివారం మా మూవీస్ హెచ్‌డీలో కూడా ప్రసారం ఉంటుందని స్టార్ గ్రూప్ తెలిపింది. కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే ఐపీఎల్ ప్రసారాలు ఉండబోవడం లేదని, అక్కడి ప్రభుత్వం అనుమతించక పోవడమే కారణమని స్టార్ స్పష్టం చేసింది.
Read Also…