- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రాంచైజీల కోరికలు తిరస్కరించిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్: కొవిడ్ 19 నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన ఐపీఎల్ సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐ ఎదుట కోరికల చిట్టాను ఉంచింది. లీగ్ సేఫ్‌గా జరిగేందుకు బోర్డు సిద్ధం చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ) విషయంలో ఫ్రాంచైజీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్ఓపీ డ్రాఫ్ట్‌లను అన్ని ఫ్రాంచైజీలకు బోర్డు అందజేసింది. ప్రతి ఫ్రాంచైజీ టీమ్ డాక్డర్‌ను ఏర్పాటు చేసుకోవాలని, టోర్నీ మొత్తం ఆ జట్టు బయో సెక్యూర్ గైడ్ లైన్స్ పాటించేలా చూసే బాధ్యత వైద్యుడిదేనని పేర్కొంది. అయితే ప్రేక్షకులను అనుమతించకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలు గేట్ మనీ (టికెట్ల ఆదాయం) కోల్పోనున్నాయి. దీంతో తమకు ఆ మేరకు డబ్బులు రీయంబర్స్ చేయాలని కోరుతున్నాయి. కానీ, బీసీసీఐ ఈ కోరికను తిరస్కరించింది. టైటిట్ స్పాన్సర్ దొరకక పోతే వచ్చే నష్టాన్ని బోర్డే భరించాలి తప్ప ఫ్రాంచైజీల మీద వేయొద్దని కోరింది. కొత్త స్పాన్సర్ దొరుకుతాడు కాబట్టి దాంతో నష్టమేం లేదని చెబుతున్నది. ఇక లీగ్‌కు ఆలస్యంగా వచ్చే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రీడాకారులకు క్వారంటైన్ సమయాన్ని తగ్గించాలని కోరుతున్నాయి. కానీ దీన్ని కూడా బీసీసీఐ తిరస్కరించింది.