మ్యూచువల్ ఫండ్లలో పెరుగుతున్న పెట్టుబడులు!

by Harish |
Mutual funds
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)పరిశ్రమలో ఎస్ఐపీ(సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా వచ్చే నిధులు భారీగా పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో దాదాపు రూ. 67,000 కోట్ల నిధులు ఎస్ఐపీ ద్వారా ఎంఎఫ్ పరిశ్రమలోకి వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఏఎంఎఫ్ఐ) గణాంకాలు వెల్లడించాయి. ఈ పెరుగుదల రిటైల్ మదుపర్లలో పెట్టుబడులకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తుందని ఏఎంఎఫ్ఐ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో ఈ రకమైన నిధులు రూ. 96,080 కోట్లు వచ్చాయని (ఏఎంఎఫ్ఐ) పేర్కొంది. అంతేకాకుండా గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ రూపంలో వచ్చే నిధుల వాటా రెండు రెట్లు పెరిగిందని, 2016-17లో ఇవి రూ. 43,921 కోట్లుగా నమోదయ్యాయని ఏఎంఎఫ్ఐ వివరించింది. ఇక, ఈ ఏడాది అక్టోబర్‌లో ఎస్ఐపీ నిధులు రూ. 10,519 కోట్లు రావడంతో జీవితకాల గరిష్ఠాలను సాధించాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో రూ. 10,351 కోట్లు వచ్చి చేరాయి.

Advertisement

Next Story

Most Viewed