గని ప్రమాద ఘటనపై విచారణ జరిపించండి : బండి

by Shyam |
గని ప్రమాద ఘటనపై విచారణ జరిపించండి : బండి
X

దిశ,తెలంగాణ బ్యూరో: భూపాలపల్లి కటికే ఆరవ గనిలో రూఫ్ కూలిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు క్యాతం నర్సయ్య, సలివేణి శంకరయ్య కుటుంబాలకు గురువారం ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అధికారులు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో మైన్స్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు అర్థమవుతుందన్నారు. కార్మికులు పనిచేసే ప్రదేశంలో కనీస రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే పైకప్పు కూలినట్లు తెలుస్తోందన్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం బాధాకరమన్నారు. సంస్థ యాజమాన్యం ఉత్పత్తి మేరకు కార్మికులను వినియోగించడం లేదని, తద్వారా పని ఒత్తిడి పెరిగి కార్మికులు శారీరక, మానసిక స్ట్రెస్ కు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాభాపేక్షే లక్ష్యంగా యాజమాన్యం పని చేయకుండా.. కార్మికుల భద్రతపై కూడా శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed