- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీలేరు పోలీసులా మజాకా..!
దిశ, ఏపీబ్యూరో: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ 9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పీలేరు అర్బన్ సీఐ సాధిక్ అలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నైకి చెందిన రాధిక అలియాస్ తులసి, గుంటూరుకు చెందిన అశోక్ తో పరిచయం ఏర్పడింది.
విజయవాడలోని అశోక్ స్నేహితుడైన భాస్కర్ రెడ్డి అతని భార్య రాధికకు ఫోను చేసి తమకు దొరికిన రూ.50 లక్షల విలువైన గుప్త నిధుల బంగారాన్ని ఇరవై ఐదు లక్షలకే ఇస్తామని చెప్పారు. ఆశపడ్డ దంపతులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మార్చి 7న పీలేరు వారపు సంతకు చేరారు. ముందుగా పథకం సిద్ధం చేసుకున్న ముఠా సభ్యులు బంగారాన్ని ఇచ్చి పరిశీలించుకోమన్నారు. బంగారాన్ని తీసుకెళ్లి పరీక్షించగా అసలు బంగారమేనని నిర్ధారించుకున్నారు. భాస్కర్ రెడ్డి దంపతులు మార్చి 15వ తేదీన పీలేరు వచ్చారు. రూ.25 లక్షలు ఇచ్చి బంగారాన్ని తీసుకెళ్లారు.
దాన్ని తిరిగి విక్రయించేందుకు ప్రయత్నించగా అది నకిలీ బంగారమని తేలింది. మోసపోయినట్లు గ్రహించారు. ఖంగుతిన్న దంపతులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మే 25న పీలేరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు.