- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొంప ముంచిన ఆన్‌లైన్ క్లాస్‌లు
దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ కోసం ఇంటర్మీడియట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన కోడిజుట్టు ప్రవళిక అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని స్మార్ట్ ఫోన్ కొనివ్వడం లేదని ఈ నెల 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
దీంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రవళిక శనివారం సాయంత్రం మృతి చెందింది. మృతురాలు ప్రవళిక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.
ఆన్‌లైన్ క్లాసులకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి కావడంతో కొనివ్వమని చాలా రోజులుగా అడుగుతున్నా పట్టించుకోకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జైపూర్ ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.