- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు
దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం నుంచి ఇంటర్మీడియట్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ పనులు ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఈ ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ బుధవారం ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ జవాబు పత్రాలను దిద్దేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో గురువారం నుంచి జవాబు పత్రాల కోడింగ్, డీకోడింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియను నాలుగైదు రోజుల్లో ముగించి ఈ నెల 11 లేదా 12వ తేదీల్లో వాల్యుయేషన్ పనులు ప్రారంభించాలని సూచించారు.
ప్రస్తుత లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున, వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాల్సి ఉందని, దీనికి అనుగుణంగా వాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను పెంచాలన్నారు. ప్రస్తుతం ఉన్న 12 కేంద్రాలకు అదనంగా 21 సబ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా.. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,80,516 మంది కాగా 4,85,323 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. ఇదిలా ఉండగా, ఇంటర్ అనంతరం డిగ్రీ, ఇతర కోర్సుల్లో చేరాల్సి ఉన్నందున ముందుగా సెకండియర్ పత్రాల వాల్యుయేషన్ ప్రారంభం కానుంది.
Tags : Intermediate board, Inter spot valuation, IAS, intermediate board telangana