ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్..

by srinivas |   ( Updated:2020-03-03 21:20:24.0  )
ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్..
X

నేటి నుంచి రెండు తెలుగు రాష్ర్టాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు. దీంతో రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కౌన్సిలర్లు అందుబాటులో ఉంచారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే bigrs.telangana.gov.in ద్వారా లాగిన్ అయ్యి తెలుసుకోవడానికి అవకాశాలు కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష ఉంటుంది. ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేసిన అధికారులు. ఎగ్జామ్ సెంటర్‌లో మొబైల్ ఫోన్లు, ఎలక్ర్టానిక్ వస్తువులు నిషేంధించారు. ఈ నెల 23వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగనున్నాయి.

Tags: Intermediate exams, AP, TS, government, Inter Board Officers

Advertisement

Next Story

Most Viewed