రూ.100 కోట్లు దాటిన 'తలైవి' బడ్జెట్

by Shyam |
రూ.100 కోట్లు దాటిన తలైవి బడ్జెట్
X

దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కంగనా రనౌత్ జయలలిత పాత్రలో కనిపిస్తున్నారు. జయలలిత బాల్యం నుంచి చనిపోయేవరకు సాగే ఈ సినిమా కథలో కంగనా.. నాలుగు గెటప్స్‌లో కనిపిస్తుందని తెలుస్తుంది. నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి జీవిత చరమాంకం వరకు జరిగిన అమ్మ కథలో కంగనాను తెరపై చూపించే క్రమంలో ఈ చిత్రం బడ్జెట్ రూ. 100 కోట్లు దాటిందని సమాచారం. ఎన్నో మలుపులతో కూడిన తలైవి జీవితాన్ని సంతృప్తికరంగా తెరకెక్కించేందుకు బడ్జెట్ గురించి లెక్కచేయలేదట నిర్మాతలు.

అయితే కంగనాను నమ్మి అంత బడ్జెట్‌తో సినిమా తీయడం కరెక్టేనా అనే ప్రశ్న మొదలైంది ఫిల్మ్ నగర్‌లో. కంగనాకు బాలీవుడ్‌లో మంచి మార్కెట్ ఉండడం కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నారట నిర్మాతలు. తమిళ చిత్రరంగానికి వస్తే… తమిళుల ఫేవరేట్ జయలలిత చిత్రం కాబట్టి తప్పకుండా సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారట. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ అమ్మకున్న క్రేజ్‌తో సినిమా తప్పకుండా బాగా ఆడుతుందనే ధీమాతో ఉన్నారట. అందుకే సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటినా ఎలాంటి భయంలేకుండా ధీమాతో ఉన్నారట.

Tags: Talaivi, Jayalalitha, Kangana Ranauth, Budget, Bollywood

Advertisement

Next Story