- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
No Shave November : ట్రెండ్‌గా మారుతోన్న 'నో షేవ్ నవంబర్'
దిశ, బంజారాహిల్స్: ఒకప్పుడు యువత తమ జుట్టును చక్కగా పాపిట తీసి, క్లీన్ షేవ్‌తో ఉండటమే అందంగా భావించే వారు. మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా యువతలో ఫ్యాషన్ పట్ల అభిరుచి మారింది. దీంతో విభిన్న రకాల హెయిర్ స్టైల్‌లతో, తీరొక్క రకాల బీయర్డ్ స్టైల్‌లతో పదిమందిలో ప్రత్యేకంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. తమ అభిమాన హీరోల సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా మెయింటేన్ చేసే గడ్డం స్టైల్‌ను కాపీ కొట్టి మురిసిపోతుంటారు. ఫ్రెంచ్ కట్, అండర్ కట్ బీయర్డ్, యాంకర్ బీయర్డ్ లాంటి పాపులర్ బీయర్డ్ స్టైల్స్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్ స్టైల్స్ కోసం హెయిర్ సెలూన్ల చుట్టూ తిరిగే యువత నవంబర్ నెలలో మాత్రం కొందరు అస్సలు సెలూన్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమేనండోయ్.. ‘నో షేవ్ నవంబర్’ ఉద్దేశమిదే.
నవంబర్ నెలంతా గడ్డం కత్తిరించుకోకుండా (షేవ్ చేసుకోకుండా) మిగిలిన డబ్బుతో క్యాన్సర్ బాధితులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. కొందరైతే డబ్బును నేరుగా క్యాన్సర్ ఫౌండేషన్‌కు అందిస్తున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్ల వ్యాధి నయం కోసం కీమోతెరఫీ చికిత్స చేస్తారు. దీని వలన రేడియేషన్ ప్రభావం మూలంగా జుట్టంతా పలుచబడి రాలిపోతుంది. దీంతో కొందరు క్యాన్సర్ బాధితుల జుట్టు రాలిపోవడంతో అందంగా లేమని బాధపడుతూ, ఆత్మనున్యత భావానికి గురవుతారు. కనుక కనీసం ఈ ఒక్క నెలంతా తమ ఒంటిపై జుట్టును కత్తిరించుకోకుండా ఉండటం మూలంగా కొంతైనా వారి బాధ తగ్గుతుందనే నమ్మకంతో ‘నో షేవ్ నవంబర్’ను పాటిస్తున్నారు. మరి కొందరైతే తమ జుట్టును క్యాన్సర్ బాధితులకు దానంగా ఇచ్చి వారి మానసిక క్షోభను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎప్పుడు ప్రారంభమైందంటే?
‘నో షేవ్ నవంబర్’ అనే పేరు మూవెంబర్ అనే సంస్థ నుండి వచ్చింది. ఈ కాన్సెప్ట్ క్యాన్సర్ బాధితులకు అండగా ఉండాలనే ఆలోచనతో ఆస్ట్రేలియాకు చెందిన మూవెంబర్ అనే స్వచ్ఛంద ఆలోచనతో పుట్టుకొచ్చింది. ఈ చిన్నపాటి సామజిక ఉద్యమం 2003లో ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రారంభమై 2009 వరకు ప్రపంచమంతా పాకింది.
మూవెంబర్ సంస్థ గురించి
ఆస్ట్రేలియాకు చెందిన మూవెంబర్ అనే స్వచ్ఛంద సంస్థ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాధితులతో పాటు ఆరోగ్య నిపుణులతో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థ వృషణ క్యాన్సర్‌తో బాధపడుతూ, మానసిక క్షోభకు గురై ఆత్యహత్యలకు పాల్పడే వారిని నిరోధించడానికి పనిచేస్తుంది. క్యాన్సర్ బాధితుల కోసం ప్రజలిచ్చే విరాళాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ బాధితుల కోసం ఖర్చు పెడుతుంది. ఆత్మహత్యల నిరోధానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మారథాన్‌లు, రన్‌లు నిర్వహిస్తుంది.
ఎంతమంది పాటిస్తున్నారంటే?
లెండింగ్ ట్రీ అనే సంస్థ ‘నో షేవ్ నవంబర్’పై ఓ సర్వే నిర్వహించారు. దీన్ని ప్రకారం అమెరికాలో ‘నో షేవ్ నవంబర్’ మూలంగా దాదాపు 46 శాతం మగవారు నవంబర్ నెలలోపు షేవింగ్ చేయించుకోబోమని తెలిపారు. అంతేకాదు 24 శాతం మహిళలు కుడా ఈ నెలలో బ్యూటీపార్లర్లకు వెళ్లకుండా ఉంటున్నారంట. 48 శాతం మగవారు వారి ముఖాన్ని క్లీన్ షేవ్‌లో కంటే బీయర్డ్ లుక్‌లో చూసుకున్నప్పుడే ఎక్కువ సంతృప్తి చెందామని తెలియజేశారు. గత సంవత్సరంలో ‘నో షేవ్ నవంబర్’ క్యాంపెయిన్ ద్వారా 1.76 మిలియన్ డాలర్స్, భారత కరెన్సీలో 13,08,47,200.00 రుపాయలు సేకరించారు.
సోషల్ మీడియా ప్రభావం..
నో షేవ్ నవంబర్ ప్రసిద్ధి చెందడంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషించింది. నవంబర్ నెలలో బీయర్డ్ లుక్‌తో సెల్పీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ కాన్సెప్ట్ ఎక్కువమందికి చేరుతోంది. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి దాకా #NO SHAVE NOVEMBER అనే హ్యాష్ టాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో 1,138,330 పోస్టులు ఉన్నాయి. అమెరికాతో పోల్చుకుంటే మన దేశంలో ‘నో షేవ్ నవంబర్’ ఇంకా అంతగా ప్రసిద్ధి చెందలేదనే చెప్పాలి. కానీ, ఇప్పుడిప్పుడే క్రమంగా ఫేమస్ అవుతోంది. 2019లో బాలీవుడ్ నటుడు శశాంక్ వ్యాస్ (తెలుగులో చిన్నారి పెళ్లి కుతురు )సీరియల్ నటుడు ‘నో షేవ్ నవంబర్’ సవాల్‌ను స్వీకరించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.
ప్రతీ సంవత్సరం పాటిస్తా : సచిందర్
నాకు గడ్డం అంటే చాలా ఇష్టం.ఎంత ఇష్టమంటే, ఇంటర్వ్యూలకూ బీయర్డ్‌తోనే వెళ్తాను. సోషల్ మీడియా ద్వారా ‘నో షేవ్ నవంబర్’ గురించి తెలిసిన వెంటనే ప్రతి సంవత్సరం నవంబర్‌లో షేవింగ్ చేయించుకోవడం లేదు. ఇలా ఈ నెలలో ఆదా అయిన డబ్బులను బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి బాధితులకు బాధితులకు అందిస్తాను.
కొంత గిరాకీ తగ్గుతుంది : జావేద్ హాబీబ్ స్టోర్ నిర్వాహకుడు
నో షేవ్ నవంబర్ మూలంగా ఇతర నెలలతో పోల్చుకుంటే నవంబర్ నెలలో మా సెలూన్‌కి వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గుతుంది. అయినా ఇది ఒక మంచి ఉద్దేశ్యంతో ఉన్న కాన్సెప్ట్ కాబట్టి నేను కూడా మద్దతు తెలుపుతాను.