తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల

by Shyam |   ( Updated:2021-06-28 05:10:38.0  )
Exams
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ ఫలితాలను వెల్లడించినట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్ధులను పాస్ చేశారు.

ఈ ఫలితాల్లో 1,76,719 మందికి ‘ఏ’ గ్రేడ్, 1,04,886 మందికి ‘బి’ గ్రేడ్, 61,887 మందికి ‘సీ’ గ్రేడ్, 1,08,093 మందికి ‘డీ’ గ్రేడ్ వచ్చినట్టు విద్యాశాఖ తెలిపింది. ఇక, ప్రాక్టికల్స్‌లో విద్యార్థులందరికీ 100 శాతం మార్కులు ఇస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించలేదు.

Advertisement

Next Story

Most Viewed