ఇంటర్ గెస్ట్ లెక్చరర్స్‌కు గుడ్ న్యూస్..

by Shyam |
ఇంటర్ గెస్ట్ లెక్చరర్స్‌కు గుడ్ న్యూస్..
X

దిశ, సిద్దిపేట : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ సేవలను ఈ విద్యాసంవత్సరం (2021-22)కు పునరుద్ధరిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల పట్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బైరగొని ప్రసాద్ హర్షం వ్యక్తంచేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆర్థిక మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఓమర్ జలీల్‌, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూధనరెడ్డి, టిగ్లా & టిప్స్ అధ్యక్షుడు ఎం. జంగయ్య, కాంట్రాక్ట్ జేఏసీ అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రంనకు గెస్ట్ ఫ్యాకల్టీ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరగోని ప్రసాద్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story