షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు : మంత్రి ఆదిమూలపు సురేష్

by srinivas |
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు : మంత్రి ఆదిమూలపు సురేష్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మే 5 నుంచి 23వరకు ఇంటర్ ఫస్ట్, సెకెండ్ ఇయర్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే పరీక్షల మెటీరియల్ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నాయని చెప్పుకొచ్చారు. ఈసారి మొత్తం పదిన్నర లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని మంత్రి వివరించారు. కొవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు మొత్తం 1400లకు పైగా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.

ఒక్కో సెంటర్‌కు ఒక్కో కొవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పరీక్షా సెంటర్‌కు వచ్చే విద్యార్థుల్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే అలాంటి వారికోసం ప్రత్యేక గదులను కేటాయిస్తున్నట్లు స్పష్టంచేశారు. అంతేకాకుండా ప్రతీ సెంటర్లో థర్మల్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన దాఖలాలు లేవని మంత్రి ఆదిమూలపు గుర్తుచేశారు. పరీక్షలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలని మంత్రి హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed