మేధావులు ప్రజాసేవలోకి రావాలి

by Shyam |
Child Welfare Committee
X

దిశ, వెబ్‌డెస్క్ : మేధావులు ప్రజాసేవలో భాగస్వాములు కావాలని సూర్యాపేట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు పెద్దపంగ స్వరూపరాణి అన్నారు. స్పేస్ సంస్థ నిర్వాహకులు పి.పూర్ణశశికాంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)సభ్యులుగా పదవీ విరమణ పొందిన బొల్లెద్దు వెంకటరత్నం, యాతాకుల సునీల్‌ను ఆమె సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ ఘనంగా సన్మానించారు.

సీడబ్ల్యూసీ బోర్డ్ సభ్యులుగా ఏడేళ్లుగా ఎందరో అనాథలు, వీధి పిల్లలు, సమాజంలో రక్షణ, సంరక్షణ అవసరమైన చిన్నారులకు బాసటగా నిలిచి వెంకటరత్నం, సునీల్‌ ఎన్నో సేవలందించారని స్వరూపరాణి కొనియాడారు. పిల్లల సమస్యలపై సేవలందించిన వీళ్లు పదవులు లేకపోయినా సామాజిక సేవలో పాలుపంచుకోవాలని కోరారు. బొల్లెద్దు వెంకటరత్నం, యాతాకుల సునీల్‌ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. వారిని సన్మానించిన వారిలో రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత భూపతి రాములు, పెరుమల్ల అశోక్, గురుచరణ్, భిక్షం, రోహిత్, పడిదల ప్రసాద్, బొమ్మగాని వెంకన్న, లావుడ్య శ్రీనివాస్, రప్పక్షి అరుణ, యాతకుల రుద్రమ్మ ఉన్నారు.

Advertisement

Next Story