రూ.12వేలు తీసుకొని రూ.2 లక్షల 50 వేలు కట్టా

by Anukaran |   ( Updated:2020-12-21 08:21:21.0  )
రూ.12వేలు తీసుకొని రూ.2 లక్షల 50 వేలు కట్టా
X

దిశ, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ లోన్ యాప్స్ ప్రతినిధుల ఆగడాలు మితిమీరుతున్నాయి. అవసరాలకు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకుని చెల్లించకపోవడంతో సదరు యాప్ ప్రతినిధులు బాధితుల్ని మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన కమిషనరేట్ల లో సుమారు 100కి పైగా ఆన్‌లైన్ లోన్ యాప్ బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. గడువు సమయంలో తీసుకున్న రుణం కట్టలేదని కుటుంబసభ్యులకు,ఫ్రెండ్స్‌కు ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తమగోడు వెళ్లబోసుకుంటున్నారు.

దీంతో పోలీసులు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ అనుమతులు పొందిన కొన్నింటిపై ఆరా తీస్తున్నాయి. అయితే ప్రతీ రోజు భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో రూట్ మార్చిన నిర్వాహకులు.., రుణాన్ని వసూలు చేసేందుకు థర్డ్ పార్టీలకు అప్పగిస్తున్నారు.

కమిషనరేట్లు పరిధిలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు.., మీరు పైసలు తీసుకున్నారు. తీసుకున్న మొత్తం కట్టేయండి లేదంటే మీ కాంటాక్ట్ నెంబర్లకు మీరు మోసం చేసినట్లు మెసేజ్ చేస్తాం. మీరు చస్తే చావండి మా పైసలు మాత్రం మీరు కట్టాల్సిందేనని బెదిరిస్తున్నట్లు చెప్పారు.

నా స్నేహితుడు క్యాన్సర్ పేషెంట్. 10వేలు తీసుకుంటే లక్షా 50వేలు కట్టాడు. ఇంకా కట్టాలని వేధిస్తున్నారు.
మరో స్నేహితురాలు 12వేలు డబ్బులు తీసుకుంటే 2లక్షల 50వేలు చెల్లించించింది. అయినా ఇంకా పేచేయాలని బెదిరిస్తున్నారంటూ కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితుల స్నేహితుడు చెప్పాడు.

Advertisement

Next Story