ఇన్‌స్టెంట్ లోన్ యాప్‌ ముఠా అరెస్ట్

by Sumithra |
Instant loan app gang arrest
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఇన్‌స్టెంట్ లోన్ యాప్‌ల ద్వారా ప్రజలను మోసాలు చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్న బెంగళూరుకి చెందిన రాజశేఖర్(27) కొన్ని లోన్ యాప్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. యాప్స్ లో ఇన్‌స్టెంట్ లోన్స్ ఇస్తామని చెప్పి వందల మందిని మోసం చేసి కోట్ల రూపాయలు తీసుకున్నాడని తెలిపారు. పోలీసుల దర్యాప్తులో మోసగాళ్లకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను గుర్తించి రూ.300 కోట్ల లావాదేవీలను నిలిపివేయించినట్లు చెప్పారు. ఈ ముఠాకి సంబంధించిన కీలక నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ముఠాకి చెందిన 25 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి రూ.73,860 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పోలీస్ ఆపరేషన్ లో సీఐ సీహెచ్. గంగాధర్, ఎస్ఐ సురేష్, కానిస్టేబుళ్లు నర్సింగ్ రావు, సందీప్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed