కంగనా కు మరో దెబ్బ.. ఈసారి ఇన్స్టాగ్రామ్ డిలీట్

by Shyam |   ( Updated:2021-05-10 01:30:36.0  )
కంగనా కు మరో దెబ్బ.. ఈసారి ఇన్స్టాగ్రామ్ డిలీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటీకే పలు అభ్యంతరకర పోస్టులు పెట్టిందని ట్విట్టర్ ఆమె ఖాతాను తొలిగించిన విషయం తెలిసిందే. ఇక ఆమె ట్విట్టర్ తొలగించడంతో ఇన్స్టాగ్రామ్ మీద పడింది. తాజాగా ఇన్స్టా కూడా కంగనా కు గట్టి షాక్ నే ఇచ్చింది. ఆమె పెట్టిన ఒక పోస్ట్ ని డిలీట్ చేసింది. దీంతో కంగనా మరోసారి విరుచుకుపడింది. ఇంతకీ ఇంస్టాల్ డిలీట్ చేసిన పోస్ట్ ఏంటంటే.. కంగనా ఇటీవలే తాను కరోనా బారిన పడ్డానని, ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నానని ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో “కరోనా ఒక చిన్న ఫ్లూ మాత్రమే.. దానికి భయపడనవసరం లేదు.. అందరు అన‌వ‌స‌రంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భ‌య‌ప‌డ‌కండి. అంద‌రం క‌లిసి దీనిని ఎదుర్కొందాం” అని కంగ‌నా ఆ పోస్ట్‌లో రాసింది. ఈ పోస్ట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో కరోనా వలన ఇంతమంది చనిపోతుంటే .. నీకు ఇది చిన్న ఫ్లూ లా కనిపిస్తుందా..? ప్రజలు చనిపోవడం నీకు జోక్ గా ఉందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పోస్ట్ ని ఇన్స్టా డిలీట్ చేసింది. ఇక తాజాగా తన పోస్ట్ ని డిలీట్ చేయడంపై కంగనా స్పందిస్తూ ” కొవిడ్‌ను నాశ‌నం చేస్తా అన్నందుకు కొంత మంది హ‌ర్ట్ అయ్యార‌ట‌.. ఉగ్రవాదులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు ట్విటర్‌లోనే ఉంటారనుకున్నా.. ఇన్‌స్టాకు వ‌చ్చి రెండు రోజులైంది కానీ ఇక్క‌డ కూడా వారం కంటే ఎక్కువ ఉండ‌నిచ్చేలా లేరు.. అంటూ స్టోరీ లో కామెంట్ చేసింది.

Advertisement

Next Story