ఇన్‌స్టాలో ‘రీల్స్, పిన్ కామెంట్స్’ ఫీచర్స్

by Harish |
ఇన్‌స్టాలో ‘రీల్స్, పిన్ కామెంట్స్’ ఫీచర్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : టిక్‌టాక్‌ను మన దేశం‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో టిక్‌టాక్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు.. ఎంతోమంది టెక్ డెవలపర్స్ ఇప్పటికే దేశీ టిక్‌టాక్‌లు తీసుకొచ్చారు. ఇంకా చాలామంది అలాంటి యాప్ రూపలక్పనలో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే పాపులర్ యాప్‌లుగా నెటిజన్ల మనసు దోచుకున్న కొన్ని యాప్ సంస్థలు.. టిక్‌టాక్ ఫీచర్లను తమ యాప్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. యూట్యూబ్ 15 సెకన్ల షార్ట్ వీడియో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఇప్పుడు అదే కోవలో ఇన్‌స్టాగ్రామ్ కూడా టిక్‌టాక్ ఫీచర్లను పోలిఉండే.. రీల్స్ అనే ఫీచర్‌ను భారత యూజర్లకు అందుబాటులోకి తేనున్నట్టు తాజాగా ప్రకటించింది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్.. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్ యూజర్లకు అందుబాటులో ఉంది. తాజాగా ఇండియాలోని ఇన్‌స్టా యూజర్ల కోసం దీని బేటా వెర్షన్‌ను పరీక్షించినట్లు తెలుస్తోంది. కొంతమంది యూజర్లకు ఇప్పటికే రీల్స్ అప్‌డేట్ కూడా వచ్చినట్లు సమాచారం. టిక్‌టాక్ లాగానే ‘రీల్స్’ కూడా యూజర్లకు 15 సెకన్ల షార్ట్ ఆడియో క్లిప్‌లతో వీడియోలు చేసి.. వాటిని స్టోరీస్‌లోకి యాడ్ చేసుకునే అవకాశం కల్పించనుంది. వాటిని ఫీడ్‌లో పోస్ట్ చేయడానికి ‘రీల్స్’ తోడ్పడుతుంది. కాగా, వైరల్ వీడియోలు లేదా ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలు.. టాప్ రీల్స్‌గా స్పెషల్ పేజీలో కనిపిస్తాయి.

ఇదేకాక, ‘విరాళాలు’ సేకరించేవాళ్ల కోసం.. ‘డొనేషన్ స్టిక్కర్స్’ను, అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో.. పారదర్శకంగా ఉండటానికి ‘డిసెబుల్ పెయిడ్ ఫర్ పొలిటికల్ యాడ్స్’ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. వీటితో పాటు ‘పిన్ కామెంట్స్’ అనే ఫీచర్‌ను సైతం భారతీయ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

పిన్ కామెంట్స్ :

బెటా వర్షన్‌ టెస్ట్‌లో భాగంగా.. కొంతమంది యూజర్లకు పిన్ కామెంట్స్ ఫీచర్‌ను అందించింది. ఇది యూజర్లందరికీ అవలేబుల్‌గా ఉంటుందని తాజాగా తన అధికారిక అకౌంట్ ద్వారా వెల్లడించింది. ట్విట్టర్ పిన్ కామెంట్స్ గురించి నెటిజన్లకు తెలుసు. ఇన్‌స్టాలో కూడా అలానే పిన్ కామెంట్స్ చేయొచ్చు. యూజర్లు కామెంట్‌ను లెఫ్ట్‌కు స్వైప్ చేసి.. పిన్ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకుని కామెంట్స్ చేస్తే.. అది టాప్‌లో కనిపిస్తుంది. యూజర్లు పిన్న్‌డ్ కామెంట్స్ చూసేంత వరకు అవి అలానే టాప్‌లో ఉంటాయి.

Advertisement

Next Story