ఈ మహిళా రైతు ఎందరికో ఆదర్శం

by Sridhar Babu |   ( Updated:2023-12-16 14:48:32.0  )
Inspiring Women Farmer
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లాలో ఓ మహిళా రైతు ఎద్దుల నాగలి చేత పట్టి దున్నుతూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మగవారి కంటే తానేమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామానికి చెందిన గోలి సరూప అనే మహిళా రైతు తనకున్న ఎకరం భూమిలో.. స్వయంగా తానే ఎద్దుల నాగలితో దున్ని విత్తనాలు వేస్తోంది. రోజుకు ఒక ఎకరం పొలాన్ని దున్ని, విత్తనాలు వేస్తానని చెబుతోంది.ను చిన్ననాటి నుండే తల్లితండ్రులకు పొలం పనులు చేస్తూ సహాయపడే దాన్ని అని, వ్యవసాయం అంటే, నాగలి పట్టి దున్నడం అంటే తనకు ఎంతో ఇష్టం అని చెబుతోంది. అలాగే గ్రామంలో మహిళా సంఘం అధ్యక్షురాలిగా, గ్రామ కో-ఆప్షన్ సభ్యులుగా ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటుండం గమనార్హం. తమకు ఒక కూతురు ఉందని.. ఆమె డిగ్రీ చదువుతుందన్నారు. తన వ్యవసాయ పనులు పూర్తైన వెంటనే ఇతర రైతుల పొలాల్లోకి కూలికి వెళ్తానని అంటోంది. మొత్తానికి మగవారి కంటే తాను ఎం తక్కువ కాదని బాలయ్యపల్లి గ్రామానికి చెందిన గోలి స్వరూప నిరూపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed