ట్రాఫిక్ రూల్స్‌పై వినూత్న ప్రచారం

by Shyam |
Innovative campaign
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చేస్తోన్న వినూత్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. కేపీహెచ్‌బీలో నివాసముండే నూకాజీ, తన సోదరుడు 2019లో హెల్మెట్ ధరించకుండా.. రాంగ్ రూట్‌లో రావడంతో యాక్సిడెంట్‌కి గురై చనిపోయారని, అప్పటినుంచి 2019 నుంచి అందరూ నిబంధనలు పాటించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. నూకాజీ మాట్లాడుతూ.. రోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ జేఎన్టీయూ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తానన్నారు. రోడ్డు దాటేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదని, ద్విచక్ర వాహనం నడిపేవారితో పాటు వెనకాల కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ వివిధ అవతారాల్లో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

Advertisement

Next Story