- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజన్న ఆలయంలో అపశృతి.. భక్తురాలి మీదుగా దూసుకెళ్లిన కోడెలు
దిశ, వేములవాడ టౌన్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కోడె మొక్కు సమర్పణలో అపశృతి జరిగింది. భూపాలపల్లి జిల్లా అంక్సాపూర్ మండలం టేకుమళ్ళ గ్రామానికి చెందిన వావిలాల లక్ష్మి తన భర్త, కుమారులతో స్వామి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో మొక్కు చెల్లించేందుకు కోడెలను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా బెదిరి ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో తాడును పట్టుకున్న లక్ష్మి మీదుగా కోడెలు తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోలేదు. వెంటనే బాధితురాలి భర్త, కుమారులు ఓ ఆటోలో ఆస్పత్రికి తరలించారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..
జరిగిన సంఘటనపై ఆలయ ఈఓ స్పందించారు. ‘బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గాయపడిన భక్తురాలి గురించి కూడా వివరాలు సేకరించి.. తగు చర్యలు తీసుకుంటాం. కృష్ణప్రసాద్, ఆలయ ఈఓ.
- Tags
- devotee