రోడ్డు ప్రమాదంలో సినీ డైరెక్టర్‌కు గాయాలు

by Shyam |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ డైరెక్టర్ కు గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగ్‌లోని సెవెన్ హిల్స్ ఉంటున్న సినీ డైరెక్టర్ సుధీర్ బుధవారం అర్ధరాత్రి బైక్‌పై వెళ్తూ.. రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద యూటర్నీ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధీర్ గాయాలపాలయ్యాడు. స్థానికుల సహాయంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story