Chandra Babu Naidu సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2021-10-20 06:30:05.0  )
Chandra Babu Naidu సంచలన నిర్ణయం
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యాలయాలు, పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా 36 గంటల పాటు దీక్ష చేయాలని నిర్ణయించారు. ’ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు‘ పేరుతో దీక్ష చేపట్టనున్నట్లు టీడీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు నిరసన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed