- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం: ఇన్ఫోసిస్
ముంబయి: కరోనా సంక్షోభంతో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే, ఎంత మందిని తీసుకుంటారనే విషయం స్పష్టం చేయకున్నా గతేడాదితో సమానంగా నియామకాలు జరపనున్నట్లు తెలుస్తున్నది. గతేడాది బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్ 18వేల మంది ఫ్రెషర్స్‌కు ఆఫర్ లెటర్లను అందించింది. ఈ సంఖ్యకు సమానమైన వారిని తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు కాలేజీలతో సంప్రదిస్తున్నట్టు వచ్చే సంవత్సరం చేరబోయే ఫ్రెషర్స్ కోసం మాట్లాడుతున్నట్టు ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డెవలప్‌మెంట్ గ్రూప్ హెచ్ఆర్ క్రిష్ శంకర్ పేర్కొన్నారు. ఆన్‌బోర్డింగ్ ద్వారా ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని, క్యాంపస్ ప్రోగ్రామ్స్ సిద్ధంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నట్టు చెప్పారు. ఇన్ఫోసిస్‌లో గతేడాది టాప్, మీడియం లెవల్ ఉద్యోగులు తగ్గి, జూనియర్ లెవల్ ఉద్యోగులు పెరిగిన సంగతి తెలిసిందే. స్థానికుల నుంచి డిమాండ్ ఉన్నందున అమెరికా, యూరప్ దేశాల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టు, లోకలైజేషన్ కొనసాగించనున్నట్టు కంపెనీ పేర్కొంది. స్థానిక డిమాండ్ ఉంది కాబట్టి లోకల్ టాలెంట్ అవసరమని క్రిష్ శంకర్ అభిప్రాయపడ్డారు.