రూ.7 లక్షల కోట్ల మార్కును చేరుకున్న ఇన్ఫోసిస్ సంస్థ

by Harish |   ( Updated:2021-08-03 11:49:25.0  )
రూ.7 లక్షల కోట్ల మార్కును చేరుకున్న ఇన్ఫోసిస్ సంస్థ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ ధర జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో మార్కెట్ క్యాప్ రూ. 7 లక్షల కోట్ల మార్కును చేరుకున్న భారతీయ నాలుగో సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. ఇప్పటివరకు దేశీయ దిగ్గజ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ మైలురాయిని సాధించాయి. ఈక్విటీ మార్కెట్లలో బలమైన ర్యాలీ నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్ 1.65 శాతం పెరిగి రూ. 1,658.7 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది.

మంగళవారం ఒక్కరోజే 1.20 లక్షల షేర్లు చేతులు మారడంతో కంపెనీ టర్నోవర్ రూ. 19.67 కోట్ల పెరిగింది. దీంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7.04 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన ఏడాది కాలంలో ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ ధర 72 శాతం ఎగసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్ విలువ 31.71 శాతం పెరిగింది. కాగా, గత నెలలో ఇన్ఫోసిస్ ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో 23 శాతం అధిక లాభాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed