- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ బలహీనత.. వారికి బిజినెస్
దిశ, ఫీచర్స్ : ప్రతి మనిషికి తమకంటూ కొన్ని ప్రత్యేకమైన అభిరుచులు, అలవాట్లు ఉంటాయి. కానీ సొంత నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలామంది ఫెయిల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లాలన్నా, ఏ డ్రెస్ వేసుకోవాలన్నా, ఏం తినాలన్నా ఇతరుల మీద ఆధారపడతారు. ఇప్పుడు ఈ బలహీనతే.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు వరంలా, ఓ బిజినెస్ మంత్రంగా మారిపోయింది. దీంతో నెటిజన్లు నెయిల్ పాలిష్ కొనుగోలు చేయాలన్నా సరే.. ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిర్ణయంపై ఆధారపడుతున్నారు. గడ్డానికి రాసుకునే ఆయిల్ నుంచి మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్ వరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పే బ్రాండ్‌ల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) ఇన్‌ఫ్లుయెన్సర్‌కు సరికొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించింది.
డిజిటల్ మీడియా విస్తృతంగా వ్యాపించడంతో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు అవకాశాలు పెరిగిన మాట వాస్తవం. ఫాలోవర్స్ సంఖ్య పెరిగినా కొద్ది, ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాపులారిటీ కూడా పెరుగుతూ పోతోంది. దాంతో పలు కంపెనీలు.. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో అసోసియేట్ అవుతూ, వారిని తమ సేల్స్ ప్రమోషన్‌కు వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ సైతం వీలైనంత ఎక్కువగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుని ‘ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్’ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో బ్రాండ్ విజిబిలిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రభావం నెటిజన్ల మీద ఉండటం వల్ల, యూజర్లు కూడా వీళ్లు చెప్పే బ్రాండ్ వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. టెలివిజన్, ప్రింట్ మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో, కంపెనీలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీదే దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా దుర్వినియోగం పెరిగిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై చీటింగ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, బ్రాండ్స్ ప్రమోషన్స్, బ్రాండ్స్ క్లెయిమ్ తదితర విషయాల్లో వాస్తవ తనిఖీ లేకపోవడాన్ని అడ్వర్టైజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ మేరకు వినియోగదారులను వాటి నుంచి కాపాడేందుకు గాను ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రకటనల విషయంలో కొన్ని మార్గదర్శకాలు అవసరమని భావించింది.
ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏదైనా కంపెనీ ప్రొడక్ట్‌ను ప్రచారం చేయాలనుకున్నా లేదా ప్రమోషన్ చేస్తున్నా.. వాటికి సంబంధించిన #ad, #collab, #promo, #sponsored , # పార్ట్‌నర్‌షిప్ వంటి డిస్‌క్లెయిమర్ వేయాలి. వివరణ లేని ఆడియో కంటెంట్ విషయంలో, ప్రారంభంలో లేదా ఆడియో కంటెంట్ చివరిలో డిస్‌క్లెయిమర్ స్పష్టంగా ప్రకటించాలి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తాము చేస్తున్న ప్రకటనలో వారు అందిస్తున్న వాదనలకు సంబంధించి శ్రద్ధ వహించాలి. ప్రకటనలో చేసిన క్లెయిమ్.. శాస్త్రీయ ఆధారాలను కలిగి ఉందని నిర్ధారిస్తుంది. దీంతో ఇన్‌ఫ్లుయెన్సర్ చెబుతున్న విషయంలో తమ ఫాలోవర్స్‌కు కూడా ఓ క్లారిటీ వస్తుంది. ‘హెయిర్ షైనింగ్, టూత్ వైటనింగ్, ఫేస్ గ్లోయింగ్’ వంటి టైటిల్స్‌తో బ్రాండ్‌కు పాజిటివ్ ఇంపాక్ట్ కలిగించే ఆయా పోస్ట్‌లు, చిత్రాలు, వీడియోలపై ఫిల్టర్లు ఉపయోగించకూడదు. మొత్తానికి యాడ్స్ వినియోగదారులను మిస్ లీడ్ చేసేలా ఉండకూడదు. యాడ్స్ విషయంలో పారదర్శకత పాటించాలి.
ఏఎస్‌సీఐ విడుదల చేసిన మార్గదర్శకాలపై కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
యూట్యూబ్‌లో ఓ ప్రొడక్ట్‌పై ఇచ్చే సమీక్ష(రివ్యూ)ను ప్రకటన అని పిలవలేం. సమీక్ష సానుకూల వీడియో కాదు. మా ఫాలోవర్స్‌కు కరెక్ట్ ఇమేజ్ ఇస్తున్నట్లు మేము నిర్ధారించుకుంటాం. ప్రేక్షకులకు సరైన సమాచారం ఇచ్చేందుకు బ్రాండ్లు మా వద్దకు వస్తాయి. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్.. బ్రాండ్ కోసం కంటెంట్‌ను తయారుచేసినప్పుడు అది సహకార ప్రయత్నం లాంటిది మాత్రమే, ప్రమోషన్ కాదు
-శ్లోక్ శ్రీవాత్సవ, యూట్యూబర్
ఇది సరైంది కాదని భావిస్తున్నా. ఎందుకంటే.. ఏదైనా ఫోన్‌కు నాలుగు రెట్ల మెరుగైన ప్రాసెసింగ్ శక్తి ఉందని శామ్‌సంగ్ మీకు చెబితే, కంటెంట్ సృష్టికర్త బ్రాండ్‌ను విశ్వసించి, ప్రేక్షకులకు తెలియజేయవచ్చు. టెక్నాలజీ పరంగా దీన్ని కొలమానంగా తీసుకోవాలా? వద్దా ? తెలుసుకోవచ్చు. షాంపూ గురించి ఓ బ్రాండ్.. ‘జుట్టును రెండు రెట్లు మెరిసేలా చేస్తుంది’ అని చెబుతోంది. మీరు దాన్ని ఎలా కొలుస్తారు? కాబట్టి, ఇది ఖచ్చితంగా అమలు చేయబడితే అది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు సవాలుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పాయింట్‌ను నిరూపించడానికి వారు బ్రాండ్‌లతో వాదించలేరు కదా. అంతేకాదు పెయిడ్ స్పాన్సర్‌షిప్ అని ఎలా చెప్పగలం? ఉదాహరణకు..హెడ్ అండ్ షోల్డర్ షాంపూ వాళ్లు మా దగ్గరకు వచ్చి రెండు వారాలు వాడమని చెప్పారు. మాకు నచ్చింది. అప్పుడు నిజంగా ప్రొడక్ట్ బాగుందని మా ఫాలోవర్స్‌కు చెబితే పెయిడ్ యాడ్ కాదు కదా
– గొగియా, ఇన్‌ఫ్లుయెన్సర్
గైడ్‌లైన్స్ విషయంలో అభిప్రాయాలు, సందేహాలు, విమర్శలు ఉండటంతో.. 2021 మార్చి 8 వరకు ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇండస్ట్రీ పర్సన్స్, వినియోగదారులతో సహా అన్ని వాటాదారుల నుండి మార్గదర్శకాలపై కౌన్సిల్ అభిప్రాయాలను ఆహ్వానించింది. సేకరించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ‘ఏఎస్‌సీఐ’ తుది మార్గదర్శకాలను 2021 మార్చి 31 నాటికి విడుదల చేస్తుంది.