టెలికాం రంగంలో నిరంతర పెట్టుబడులకు చర్యలు అవసరం

by Harish |
barathi-raja
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగంలో నిరంతర పెట్టుబడులకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఈ రంగంలో ప్రస్తుతం ఉన్న 3+1 నిర్మాణాన్ని కొనసాగించేందుకు పరిశ్రమకు దీర్ఘకాలిక మద్దతు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థికవ్యవస్థలో టెలికాం రంగం పాత్ర మరింత విస్తరిస్తున్న కొద్దీ, దాని సవాళ్లు పెద్దవిగా ఉన్నాయని సునీల్ మిట్టల్ తెలిపారు. నిలకడలేని ధరలు, అధిక మూలధన అవసరాలు, తక్కువ రాబడి వంటి సమస్యలు, ఇంకా చట్టపరమైన అంశాలు ఇబ్బందిగా మారాయని ఎయిర్‌టెల్ వార్షిక నివేదికలో ఆయన వివరించారు.

టెలికాం పరిశ్రమ ప్రస్తుతం 3+1(మూడు ప్రైవేట్ కంపెనీలు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ) నిర్మాణాన్ని కొనసాగించేలా, వాటి పెట్టుబడులపై రాబడిని సాధించేందుకు దీర్ఘకాలిక మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలో నిరంతర పెట్టుబడులు కొనసాగే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం, టెలికాం నియంత్రణ సంస్థ ముందుకొస్తాయని ఆశిస్తున్నట్టు మిట్టల్ చెప్పారు. ‘డిజిటల్ ఆర్థికవ్యవస్థగా భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చేందుకు తమకు అవకాశం ఉంది. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, భాగస్వామ్యం ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్‌లకు సహకారం అందించడానికి ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని, ఎయిర్‌టెల్ దీనికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed