ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి క్షీణత

by Harish |
ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి క్షీణత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 8 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ఈ క్షీణత నమోదైందని సోమవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్(ఐఐపీ) గణాంకాల ప్రకారం..తయారీ రంగ ఉత్పత్తి 8.6 శాతం క్షీణించగా, మైనింగ్ 9.8 శాతం, విద్యుత్ రంగంలో ఉత్పత్తి 1.8 శాతం పడిపోయాయి.

గతేడాది ఆగస్టులో ఐఐపీ 1.4 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ‘కొవిడ్-19 మహమ్మరి తర్వాత నెలల ఉత్పత్తిని కరోనాకు ముందునాటి ఐఐపీతో పోల్చడం సముచితం కాదని గణాంకాల శాఖ అభిప్రాయపడింది. క్రమంగా పరిమితుల సడలింపుతో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలలో కార్యకలాపాలు పునరుద్ధరించబడుతున్నాయని, గణాంకాల సేకరణ కూడా మెరుగ్గా జరుగుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

Next Story