ఇండస్‌ఇండ్ బ్యాంకు భారీ విరాళం

by vinod kumar |
ఇండస్‌ఇండ్ బ్యాంకు భారీ విరాళం
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్‌ఇండ్ ముందుకొచ్చింది. ఈ మహమ్మారి కట్టడికి రూ.30 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. అయితే, ఈ విరాళాన్ని పీఎం కేర్స్‌కు అందజేస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుందా అన్నదానిపై స్పష్టతనివ్వలేదు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. అలాగే, కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా త్వరలోనే పీపీఈలను అందించనున్నట్లు తెలిపింది.

Tags: corona, indusind bank, donates, rs.30 crore

Advertisement

Next Story