సింధు నాగరికత అంతానికి ఆ మార్పులే కారణం..!

by Shamantha N |
సింధు నాగరికత అంతానికి ఆ మార్పులే కారణం..!
X

దిశ వెబ్‎డెస్క్: అతి ప్రాచీన సింధు లోయ నాగరికత, హరప్పా నాగరికత అంతానికి వాతావరణ మార్పులే కారణమై ఉండొచ్చని తాజాగా ఓ అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులతో రుతుపవనాల్లో తీరుతెన్నులు, వర్షాల్లో మార్పులే సింధులోయ నాగరికత అంతరించిపోవడానికి కారణమని ఓ శాస్త్రజ్ఞుడి పరిశోధనలో తేలింది.

అమెరికాలోని రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఆర్ఐటీ)కి చెందిన సైంటిస్టు నిషంత్ మాలిక్.. ఉత్తర భారతంలో ప్రాచీన కాలంనాటి వాతావరణాన్ని విశ్లేషించేందుకు సరికొత్త మేథమెటికల్ పద్ధతిని కనుగొన్నారు. పరిశోధనా జర్నల్ కేయోస్‌లో ప్రచురితమైన అధ్యయనంలో నిషంత్ మాలిక్ తన పరిశోధనలను వివరించారు. తన పరిశోధనలకు దక్షిణాసియాలోని గుహల్లోని స్టాలగ్‌మైట్ లో నిక్షిప్తమైన రసాయనాలను ఉపయోగించుకున్నట్టు తెలిపారు. వీటి ఆధారంగా ఆ ప్రాంతాల్లో సుమారు 5,700 ఏళ్లపాటు కురిసిన వర్షాపాత వివరాల ఆధారంగా రేఖామాత్రంగా అంచనా వేయవచ్చన్నారు. ఇండో ఆర్యన్ ఆక్రమణ కారణంగా భూకంపం కారణంగా సింధు లోయ నాగరికత ధ్వంసమై ఉండొచ్చని అన్నారు.

Advertisement

Next Story