- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్షీణించిన సేవల ఎగుమతులు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన సంగతి తెలిసిందే. దేశ ఆర్థికవ్యవస్థ కూడా ఎగుమతుల పరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అతిపెద్ద సంక్షోభం తర్వాత నిలదొక్కుకుంటున్న భారత్ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో దేశీయ సేవల ఎగుమతులు క్షీణించాయి.
సెప్టెంబర్‌లో భారత సేవల ఎగుమతులు 1.4 శాతం తగ్గి సుమారు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఇటీవల ఆర్‌బీఐ డేటా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు సుమారు రూ. 1.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులతో పాటు సేవల దిగుమతులు (లేదా చెల్లింపులు) కూడా తగ్గాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి 8.7 శాతం తగ్గి సుమారు రూ. 75 వేల కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో సేవల దిగుమతులు సుమారు రూ. 82 వేల కోట్లుగా నమోదయ్యాయని ఆర్‌బీఐ డేటా స్పష్టం చేసింది.
Advertisement
Next Story