ఒమిక్రాన్ టెన్షన్.. డబుల్ సెంచరీ దాటిన కేసులు

by Anukaran |
ఒమిక్రాన్ టెన్షన్.. డబుల్ సెంచరీ దాటిన కేసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ.. 86 దేశాలకు పాకింది. అయితే, భారత్‌లోనూ అంతే వేగంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదవగా.. రెండు వారాల్లోనే 200 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.

Advertisement

Next Story