బీమా రంగం వాటా ప్రపంచ సగటు కంటే తక్కువ

by Harish |
బీమా రంగం వాటా ప్రపంచ సగటు కంటే తక్కువ
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రకారం..ప్రస్తుత జీడీపీలో దేశీయ బీమా రంగం వాటా కేవలం 3.76 శాతంగా ఉందని, ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువని శుక్రవారం ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇది ఆసియా దేశాలైన చైనా, మలేషియా, థాయ్‌లాండ్ సహా ప్రపంచ సగటు కన్నా తక్కువగా ఉంది. దేశీయ బీమా రంగం వాటా 2001లో 2.71 శాతం నుంచి 2019లో 3.76 శాతానికి పెరిగినప్పటికీ, కీలకమైన ఆసియా దేశాల కంటే తక్కువగా ఉంది.

ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ 2.82 శాతం, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ 0.94 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ సగటును గమనిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ 3.35 శాతం, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ 3.88 శాతం కంటే గణనీయమైన తగ్గుదల అని ఆర్థిక సర్వే తెలిపింది. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ విభాగాలు ఉన్నాయి.

Advertisement

Next Story