‘భారత్‌లో వాటితో పాటు ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతోంది’

by Harish |
hiring
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఉద్యోగ నియామకాలు ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పుంజుకున్నాయని ప్రముఖ జాబ్ పోర్టల్ లింక్‌డ్ఇన్ అభిప్రాయపడింది. ఏప్రిల్‌లో 10 శాతంగా ఉన్న నియామక రేటు మేలో 35 శాతానికి పెరిగిందని, అయితే సెకెండ్ వేవ్ కారణంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని లింక్‌డ్ఇన్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఏడాది మార్చిలో భారత నియామాకాల రేటు 50 శాతం నుంచి ఏప్రిల్‌లో 10 శాతానికి పడిపోయింది. అనంతరం దేశంలోని అనేక ప్రాంతాల్లో విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేయడంతో పాక్షికంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో మేలో నియామకాల రేటు 35 శాతానికి పుంజుకుందని లింక్‌డ్ఇన్ వివరించింది.

నియామకాల రేటు మెరుగుపడుతున్నప్పటికీ, మహిళా ఉద్యోగులు, నైపుణ్యం కలిగిన వారు ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. అలాగే, ఉద్యోగం చేస్తున్న స్త్రీలు పురుషుల కంటే 4 రెట్లు తక్కువ విశ్వాసాన్ని కలిగి ఉన్నారని, కొత్తగా గ్రాడ్యుయేట్ అయినవారు ఉద్యోగాలు సంపాదించే సమయం సగటున 2 నుంచి 3 నెలలకు పెరిగిందని లింక్‌డ్ఇన్ వెల్లడించింది. ఫైనాన్స్, కార్పొరేట్ సర్వీసెస్, ఉత్పత్తి, హెల్త్‌కేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా అండ్ కమ్యూనికేషన్మ్, ఆటో, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్, స్టాఫ్ అండ్ రిక్రూటింగ్ విభాగాల్లో నియామకాలు క్షీణించాయని లింక్‌డ్ఇన్ వివరించింది.

Advertisement

Next Story