- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా మార్కెట్ల ఎగుమతులు, దిగుమతుల్లో అనేక మార్పులొచ్చాయి. ముఖ్యంగా పెట్టుబడి దారుల ప్రధాన వనరు బంగారంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. మే నెలలో విదేశాల నుంచి బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోగా.. జూన్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగింది. దీంతో జూన్‌లో బంగారం దిగుమతులు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కేవలం 11 టన్నుల బంగారం దిగుమతి జరిగినట్టు ప్రభుత్వం వర్గాలు పేర్కొన్నాయి.
గతేడాది ఇదే నెలలో మొత్తం 77.73 టన్నులతో పోలిస్తే 86 శాతం క్షీణించాయి. కరోనాను నియంత్రించే క్రమంలో అంతర్జాతీయ విమానయాన ప్రయాణాలను నిషేధించడంతో పాటు, దేశీయంగా అనేక ప్రాంతాల్లో బంగారు ఆభరణాల దుకాణాలు మూతపడటం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరకు రికార్డు స్థాయికి పెరగడంతో బంగారం దిగుమతుల్లో క్షీణత నమోదనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్య పరంగా పరిశీలిస్తే గతేడాది జూన్‌లో దిగుతి జరిగిన బంగారం విలువ మొత్తం సుమారు రూ. 20 వేల కోట్లు కాగా, గత నెలలో దిగుమతి అయిన బంగారం విలువ మొత్తం సుమారు రూ. 4,560 కోట్లకే పరిమితమైంది.