- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత జీడీపీ 20 శాతం కుదించుకుపోవచ్చు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావిత అంతరాయాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 20 శాతం కుదించుకుపోయే అవకాశముందని కేర్ రేటింగ్స్ తెలిపింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌వో) ఆగష్టు 31న జీడీపీ గణాంకాలను వెల్లడించనున్నది. ఇది కొవిడ్-19, లాక్‌డౌన్ వల్ల ఏర్పడ్డ ప్రతికూల ప్రభావం గణాంకాలపై ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ త్రైమాసికంలో ఆర్థిక పనితీరుపై గణనీయమైన అనిశ్చితి ఉన్నప్పటికీ, లాక్‌డౌన్ ప్రతికూల ప్రభావాన్ని పరిశీలించి నిజమైన జీడీపీ వృద్ధిని 20 శాతానికి కుదిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ నివేదికలో పేర్కొంది.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల అంతరాయాలు దేశ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను నిర్వీర్యం చేశాయని నివేదిక వెల్లడించింది. వ్యవసాయం, ఎన్‌బీఎఫ్‌సీ సహా బ్యాంకింగ్, గ్రామీణ ప్రాంతాల్లోని నిర్మాణ కార్యకలాపాలు లాక్‌డౌన్ నుంచి మినహాయించినప్పటికీ కార్మికుల కొరత, ఇతర సమస్యల కారణంగా కార్యకలాపాలు దెబ్బతిన్నాయని రేటింగ్ ఏజెన్సీ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల విలువ జోడింపు(జీవీఏ) దాదాపు 19.9 శాతం కుదించుకుపోయే అవకాశముందని తెలిపింది. తక్కువ పన్ను వసూళ్లు జీడీపీపై భారంగా మారాయని, దీనివల్ల వృద్ధి మరింత తగ్గిందని నివేదిక తెలిపింది.