- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జూన్‌లో పుంజుకున్న ఇంధన అమ్మకాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షల సడలింపు నేపథ్యంలో జూన్ నెలలో దేశీయంగా ఇంధన డిమాండ్ పుంజుకుంది. పెట్రోల్ అమ్మకాలు కొవిడ్‌కు ముందుస్థాయిలో 90 శాతానికి చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన పెట్రోల్ గతేడాది ఇదే నెలతో పోలిస్తే 5.5 శాతం పెరిగి 21.2 లక్షల టన్నులకు చేరుకుంది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఇది 29.35 శాతం అధికం. అలాగే, 2019, జూన్ అంటే కరోనాకు ముందుస్థాయితో పోలిస్తే 10.4 శాతం తక్కువని ఇంధన రిటైలర్ల వివరాలను బట్టి తెలుస్తోంది. ఇక, దేశీయంగా అత్యధికంగా వినియోగించే డీజిల్ ఇంధన అమ్మకాలు మేతో పోలిస్తే 18.5 శాతం పెరిగి 53.5 లక్షల టన్నులకు చేరుకున్నాయి.
గతేడాది పోలిస్తే ఇది 1.84 శాతం, కరోనాకు ముందుతో పోలిస్తే 18.8 శాతం క్షీణత. ఈ ఏడాది మార్చిలో ఇంధన అమ్మకాలు సాధారణ స్థాయికి చేరుకున్న సమయంలో సెకెండ్ వేవ్ కారణంగా తిరిగి పతనమయ్యాయి. దేశంలోకి అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో ఇంధన అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రస్తుత కేలండర్ ఏడాది చివరి నాటికి కరోనాకు ముందుస్థాయిలో ఇంధన అమ్మకాలు నమోదవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, సమీక్షించిన నెలలో ఇంట్లో వాడే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగం 9.5 శాతం పెరిగి 22.3 టన్నులకు చేరుకుంది. ఇది కరోనాకు ముందుతో పోలిస్తే 26.3 శాతం వృద్ధి. ఇక, విమానాల్లో వినియోగించే జెట్ ఇంధనం 9.9 శాతం పెరిగి 2,33,400 టన్నులకు చేరుకోగా, కరోనాకు ముందుతో పోలిస్తే ఇది 61.7 శాతం తక్కువ.