- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియన్ సినిమా రంగంలో సరికొత్త విప్లవం రాబోతుంది. సినిమా షూటింగ్ విషయంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, చాలెంజ్‌ల నడుమ షూటింగ్ జరపలేకపోతున్న కారణంగా.. ఇండియాలో తొలిసారిగా వర్చువల్ షూటింగ్ జరగబోతోంది. ‘సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని ఉపయోగిస్తూ వర్చువల్ షూటింగ్ ద్వారా సినిమా పూర్తి చేయబోతున్నాం’ అంటూ ప్రకటించారు మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్విరాజ్.
పృథ్విరాజ్ సుకుమారన్ వారియర్‌గా కనిపించబోతున్న ఈ చారిత్రాత్మక చిత్రాన్ని గోకుల్ రాజ్ భాస్కర్ డైరెక్ట్ చేయబోతున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది మూవీ యూనిట్.
https://www.instagram.com/p/CD-iCqig7fS/?igshid=1c3wvmzc1v5dq